యాషెస్ సిరీస్ 2023 రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండో టెస్టు ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ బెయిర్ స్టో ఔటైన విధానం వివాదానికి దారితీసింది. దీంతో ఆసీస్ టీమ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్రంగా మండిపడుతుండగా...టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఆస్ట్రేలియా టీమ్ను మెచ్చుకున్నాడు.
వాళ్లది స్మార్ట్ గేమ్..
వివాదాస్పద ఔట్ల విషయంలో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్ అశ్విన్..ఆసీస్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. అలెక్స్ కారీ చేసిన దాంట్లో తప్పేమి లేదన్నాడు. నిబంధనల ప్రకారమే బెయిర్ స్టోను అవుట్ చేశాడని స్పష్టం చేశాడు. వికెట్లకు దూరంగా ఉన్న కారీ... స్టంప్స్‌పైకి బాల్ విసిరాడంటే అంతకుముందు బెయిర్‌స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ALSO READ:ఈడీ ఎదుట హాజరైన అనీల్ అంబానీ
ICC నియమం ఏం చెబుతోంది..
ఐసీసీ నిబంధనల ప్రకారం..ప్లేయింగ్ కండిషన్స్లోని రూల్ 20.1.2 ప్రకారం స్టంప్‌కు బంతిని విసిరే హక్కు కారీకి ఉంది. నియమం 20.1.2 ప్రకారం.."క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ బంతిని వదిలిపెట్టిన తర్వాత అంపైర్ ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఆ బంతి డెడ్ బాల్గా పరిగణించబడుతుంది. ఆ తర్వాత బ్యాట్స్మన్ క్రీజు నుంచి బయటకు వచ్చినా ఏం కాదు. కానీ అంపైర్ డెడ్ బాల్గా పరిగణించకంటే ముందు క్రీజును వదిలిపెడితే కీపర్ లేదా ఫీల్డర్ రనౌట్ చేయొచ్చు.