ఆసియా చాంపియన్‌‌షిప్స్ పోరు షురూ.. ఇండియా రాకెట్‌‌ స్టార్లు రాణించేనా..?

ఆసియా చాంపియన్‌‌షిప్స్ పోరు షురూ.. ఇండియా రాకెట్‌‌ స్టార్లు రాణించేనా..?

నింగ్‌‌బో (చైనా): ఈ సీజన్‌‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఇండియా స్టార్ షట్లర్లు మరో కఠిన పరీక్షకు సిద్ధమయ్యారు.  మంగళవారం ప్రారంభమయ్యే బాడ్మింటన్ ఆసియా చాంపియన్‌‌షిప్స్‌‌లో పీవీ సింధు, హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌, లక్ష్య సేన్‌‌ తదితర టాప్ షట్లరు  తిరిగి ఫామ్‌‌ అందుకోవాలని చూస్తున్నారు. మెన్స్ సింగిల్స్‎లో 18వ ర్యాంకర్ లక్ష్య తొలి రౌండ్‌‌లో తైపీ షట్లర్ లీ చియా హావోతో పోటీపడతాడు. 

ప్రణయ్‌‌ చైనాకు చెందిన గ్వాంగ్ జు లుతో పోరు ఆరంభిస్తాడు. విమెన్స్ సింగిల్స్‌‌లో పీవీ సింధుపై అంచనాలున్నాయి. 17వ ర్యాంక్‌‌కు పడిపోయిన సింధు తొలి పోరులో ఇండోనేసియా ప్లేయర్ ఎస్టర్ నురు మి ట్రి వార్డోయోను ఎదుర్కోనుంది. అనుపమ ఉపాధ్యాయ, మాళవిక బన్సొద్‌‌, ఆకర్షి కశ్యప్, విమెన్స్‌‌ డబుల్స్‌‌లో 9వ ర్యాంకర్స్‌‌ పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ కూడా బరిలో నిలిచారు.