ఉలెన్‌బాటర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రెజ్లర్ల పట్టు అదిరింది. స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించగా, బజ్‌రంగ్ పూనియా, గౌరవ్ బలియాన్ సిల్వర్ మెడల్స్‌తో మెరిశారు. శనివారం జరిగిన మెన్స్ 57 కేజీల టైటిల్ బౌట్‌లో రవి.. టెక్నికల్ సుపిరియారిటీ (12–2)తో రక్హత్ కల్జానా (కజకిస్తాన్)ను ఓడించాడు. దీంతో ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.
2020 (న్యూఢిల్లీ), 2021 (అల్మటీ)లోనూ ఈ ఇండియన్ రెజ్లర్ గోల్డ్ మెడల్స్ నెగ్గాడు. ఫైనల్ చేరే క్రమంలో 15–4తో రికుటో అరై (జపాన్)పై, 12-–5తో జనబాజర్ జండాబుడ్ (మంగోలియా)పై గెలిచిన రవి.. లాస్ట్ బౌట్‌లోనూ అదరగొట్టాడు. బౌట్‌ను స్లోగా స్టార్ట్ చేసినా.. కీలక టైమ్‌లో వరుసగా ఆరు పాయింట్లు సాధించాడు. సెకండ్ పీరియడ్‌లో కల్జానా లెఫ్ట్ లెగ్‌ను టార్గెట్ చేసి వరుస పాయింట్లతో మెడల్ సాధించాడు.
65 కేజీ ఫైనల్లో బజ్‌రంగ్ పూనియా 1–3తో రెహమాన్ మౌసా అమెజాడకలి (ఇరాన్) చేతిలో ఓడగా, 79 కేజీ టైటిల్ బౌట్‌లో గౌరవ్ బలియాన్... అలీ భక్తియార్ సవడోకు (ఇరాన్) చేతిలో ఓడి సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. 70 కేజీల్లో నవీన్ 8–0తో టెములెన్ ఎంకుతుయా (మంగోలియా)పై, 97 కేజీల్లో సత్యవర్త్ కడియాన్ 10–0తో జయముమ్మెట్ సపరోవ్ (తుర్కుమెనిస్తాన్)పై గెలిచి బ్రాంజ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా 15 మెడల్స్ (1 గోల్డ్, 4 సిల్వర్, 10 బ్రాంజ్)ను గెలుచుకుంది.