భూ తగాదాలతో ..ముగ్గురు మృతి

రాష్ట్రంలో భూ తగాదాలతో మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ధరణి వచ్చిన తర్వాత భూపంచాయితీలు ఎక్కువయ్యాయి. భూమి కోసం పరస్పర దాడులు చేసుకుంటున్నారు. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూవివాదంలో  ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో భూ తగాదాలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. కర్రెలు, రాళ్లతో ఇరు వర్గాలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ దాడిలో మండల నర్సయ్య, మండల బతుకమ్మ, మండల లింగయ్య  మృతి  చెందారు. మరో  ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి  పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.