ఆసిఫాబాద్​ స్టూడెంట్లు అదరహో .. ఇంటర్​ సెకండియర్ ఫలి ఫలితాల్లో జిల్లాకు సెకండ్​ ప్లేస్

ఆసిఫాబాద్​ స్టూడెంట్లు అదరహో .. ఇంటర్​ సెకండియర్ ఫలి ఫలితాల్లో జిల్లాకు సెకండ్​ ప్లేస్
  • ఫస్టియర్​లో నాలుగో స్థానం
  • వెనుకబడ్డ మిగతా జిల్లాలు
  • ఫస్టియర్​లో మంచిర్యాల జిల్లాకు 26, సెకండియర్​లో 21వ స్థానం
  • ఆదిలాబాద్​కు 27, 12వ స్థానం
  • నిర్మల్​కు 17, 10వ ర్యాంకు
  • అన్ని జిల్లాలో బాయ్స్​ కంటే బాలికలు మందంజ

నెట్​వర్క్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండియర్​లో రాష్ట్రంలోనే రెండో స్థానం సాధించారు. ఫస్టియర్​లో నాలుగో స్థానంలో నిలిచారు. సెకండియర్​లో బాలురు 1,882, బాలికలు 2,317, మొత్తం 4,199 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 3,339 మంది పాసయ్యారు. 79.5 02 శాతం ఫలితాలతో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 8వ స్థానంలో నిలిచిన జిల్లా విద్యార్థులు.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించారు. ఫస్టియర్​లో బాలురు 1749,  బాలికలు 2246, మొత్తం 3,995 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 2,816 మంది పాస్ అయ్యారు. 70.49 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. రెబ్బెన, సిర్పూర్​ యు,  దహెగాంలోని కేజీబీవీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 

నిరాశపర్చిన ఫలితాలు

ఫలితాల్లో మంచిర్యాల జిల్లా వెనుకబడ్డది. ఫస్టియర్​లో 54.48 ఉత్తీర్ణత శాతంతో నిరాశపర్చగా, సెకండియర్​లో 67.85 శాతం ఉత్తీర్ణతతో కాస్త ఊరట కలిగింది. జిల్లాలోని కేజీబీవీ స్టూడెంట్స్​సత్తా చాటారు. ఫస్టియర్​లో 445 మంది విద్యార్థులు హాజరై 78.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపీసీలో జైపూర్​ కేజీబీవీ నుంచి చందనాగౌరీ, సంధ్యారాణి 470 మార్కులకు 462 మార్కులు, బైపీసీలో మంచిర్యాల కేజీబీవీకి చెందిన ఊర్వశి 440 మార్కులకు 431 మార్కులు, సీఈసీలో నెన్నెల కేజీబీవీ విద్యార్థిని అంజలి 500 మార్కులకు 463, ఎంపీహెచ్​డబ్ల్యూలో మందమర్రి కేజీబీవీకి చెందిన షేక్ నజియా 500 మార్కులకు 495 మార్కులు సాధించారు. సెకండియర్​లో 441 మంది విద్యార్థులు హాజరైతే 86.85 శాతం పాసయ్యారు.

 ఎంపీసీలో బెల్లంపల్లి కేజీబీవీ విద్యార్థిని మల్లేశ్వరి 983, బైపీసీలో మానసకు 988 మార్కులు వచ్చాయి. సీఈసీలో నెన్నెల కేజీబీవీలో చదివే లిఖిత 913, ఎంపీహెచ్​డబ్ల్యూలో మందమర్రి కేజీబీవీకి చెందిన మెహరాజ్ బేగం 974 మార్కులు సాధించారు.  అదేవిధంగా మందమర్రి, జైపూర్ కేజీబీవీ విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. లక్సెట్టిపేటలోని సోషల్​వెల్ఫేర్​ రెసిడెన్షియల్​లో సెకండియర్ చదివిన చిట్ల అస్మిత ఎంపీసీలో 994 మార్కులు, బైపీసీలో కె.అక్షిత 994 మార్కులు, ఒకేషనల్​లో సీహెచ్.అక్షయ 987 మార్కులు సాధించారు.

మళ్లీ రాణించిన సీవోఈ స్టూడెంట్లు

బెల్లంపల్లి పట్టణంలోని సీవోఈ విద్యార్థులు సత్తాచాటారు. ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో కె.మన్విత్‌‌ కు 462 మార్కులు, జి.శశాంక్‌‌కు 461 మార్కులు వచ్చాయి. బైపీసీలో జి.పృథ్వీరాజ్‌‌కు 428 మార్కులు, ఐ. శ్రీరామ్‌‌కు 418 మార్కులు వచ్చాయి. సెకండియర్ బైపీసీలో ఎం.కార్తీక్‌‌కు 984, సీహెచ్ నందకిషోర్‌‌కు 974 మార్కులు, ఎంపీసీలో సీహెచ్.సాయికుమార్‌‌కు 983, బి. ప్రవీణ్‌‌కు 981 మార్కులు వచ్చాయి.

పడిపోయిన ఆదిలాబాద్ ర్యాంక్

ఫస్టియర్​లో 53.07 శాతంతో ఆదిలాబాద్​ జిల్లా 27వ స్థానంలో, సెకండియర్​లో 69.57 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. గతేడాది ఫస్టియర్​లో 9వ స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి 27వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. బోథ్​లోని ప్రభుత్వం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యార్థులు సెకండియర్​లో వందశాతం ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో ఎం.నిందిని 987, బి.హాసిని 986, పి.శ్రావ్య 983, జి.ఐశ్వర్య 980, జె.వర్ష 978, జి.పూజిత 977, ఎం.మేఘన 974, ఆర్.వైష్ణవి 974, యు.రజిత 973 మార్కులు సాధించారు. ఫస్టియర్​లో 99 శాతం ఉత్తీర్ణులయ్యారు. బైపీసీలో జి.మల్లీశ్వరి 430, ఇ.కీర్తన 430, ఎ.కీర్తన 429, ఎ.మధుప్రియ 424, డి.శ్రీజ 422, బి.కీర్తన 420, ఎల్.సౌజన్య 420 మార్కులు సాధించారు.

టాపర్లు గా టీజీఆర్ జేసీ స్టూడెంట్స్

నిర్మల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ టాపర్లుగా నిలిచారు. ఎంపీసీ ఫస్టియర్ లో అలికే శార్వాణికి 465, పురారి శ్రీవల్లి 465, వి. సంధ్యారాణి 464, డి.వర్షిని 464, జి.కీర్తనకు 463 మార్కులు వచ్చాయి. బైపీసీ ఫస్టియర్ లో బర్మా అక్షయ 435, బి.విజయలక్ష్మి 433, ఎస్ కీర్తన 433, టి.వైష్ణవి 432 మార్కులతో మెరిశారు. కుభీర్ మండలంలోని సిర్పెల్లి తాండా(3)కి చెందిన రాథోడ్ జయశ్రీ తానాజీ దంపతుల కుమార్తె అంజలి బైపీసీ సెకండియర్​లో 993 మార్కులు సాధించి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించింది. గొల్లెన అన్విత 986, తునికి శ్రీనిధి 982 మార్కులు సాధించారు. ఎంపీసీలో రేంక సుప్రియ 992, గజముల అవంతిక 991, మాలేపు అక్షయ 989, శ్రీ హర్షవీణ 989, రేగుంట సింధూర 988 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.