- బీఎస్ఎన్ఎల్ డీఈ శ్రీధర్
ఆసిఫాబాద్, వెలుగు: ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామని బీఎస్ఎన్ఎల్ డీఈ శ్రీధర్ తెలిపారు. బుధవారం స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో వినియోగదారులకు అవగాహన వర్క్ షాపు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... గతంతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి చెందుతోందన్నారు. నాణ్యమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సెల్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించడానికి భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఎస్డీఈ రవికుమార్, సురేందర్ సదానందం, జేటివోలు తిరుపతి, రాజేశ్వర్ పాల్గొన్నారు.