సీసీ కెమెరాలతో నేరాలకు చెక్​: ఏఎస్పీ పంకజ్​ పరితోష్​

భద్రాచలం,వెలుగు : సీసీ కెమెరాలతో నేరాలకు చెక్​ పెట్టొచ్చని భద్రాచలం ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ అన్నారు. ఆటో యూనియన్​ నాయకులు, ఇండస్ట్రియల్​ యూనియన్​ నాయకులు   ఇచ్చిన 32 సీసీ కెమెరాలను సోమవారం ఆయన పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ... నేరాల నియంత్రణకు ఈ సీసీ కెమెరాలు చాలా వరకు ఉపయోగ పడుతున్నాయన్నారు. అందరూ తమ తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు చొరవ చూపుతున్న ట్రాఫిక్​ ఎస్సై మధుప్రసాద్​, టౌన్​ ఎస్సై పీవీఎన్​రావును ఆయన అభినందించారు.