సీఎం హిమంత వర్సెస్ ఎంపీ గౌరవ్​ గొగోయ్

సీఎం హిమంత వర్సెస్ ఎంపీ గౌరవ్​ గొగోయ్
  • పాక్​తో సంబంధాలపై ప్రశ్నించిన అస్సాం సీఎం
  • దీటుగా ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్​ ఎంపీ​

గువహటి: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్​ ఎంపీ గౌరవ్​ గొగోయ్​మధ్య ఆదివారం ఎక్స్​ వేదికగా మాటల యుద్ధ నడించింది. ప్రతిపక్ష నాయకుడైన గొగోయ్​కు పాకిస్తాన్​తో సంబంధాలున్నాయని సీఎం హిమంత విమర్శలకు దిగారు. అదేస్థాయిలో గొగోయ్​ కూడా కౌంటర్​ ఇచ్చారు. మొదట గొగోయ్ కి హిమంత బిశ్వ శర్మ 3 ప్రశ్నలు సంధించారు. ‘‘గొగోయ్ 15 రోజుల పాటు పాకిస్తాన్​లో ఉన్నారా? ఉంటే, ఆ సందర్శన ఉద్దేశం ఏమిటి?  గొగోయ్ భార్య పాకిస్తాన్​కు చెందిన ఓ ఎన్జీవోనుంచి జీతం తీసుకుంటున్నారా?  గొగోయ్ భార్యకు పాకిస్తాన్​లో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు. 

అలాగే, గొగోయ్​ భార్య, పిల్లలు ఏ దేశ పౌరసత్వం కలిగి ఉన్నారు? అని అడిగారు. దీనికి గొగోయ్​కౌంటర్​ ఇచ్చారు. ‘‘శర్మ తన ఆరోపణలను రుజువు చేయలేకపోతే రాజీనామా చేస్తారా? శర్మ తన భార్య, పిల్లల గురించి ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? అస్సాంలోని కోల్ మాఫియాతో సంబంధాలున్న వారిని రాష్ట్ర పోలీసులు అరెస్టు చేస్తారా?” అని ప్రశ్నించారు.  సిట్​ నివేదక కోసం వేచిచూస్తున్నానని అన్నారు. గొగోయ్​ ప్రశ్నలకు కౌంటర్​గా హిమంత మళ్లీ పోస్ట్​ పెట్టారు. ‘నేను, నా భార్య, పిల్లలు  ఎప్పుడూ పాకిస్తాన్​లో పర్యటించలేదు. మా ఇంట్లో ఎవరికీ పాకిస్తాన్ నుంచి శాలరీ అందడంలేదు. పాకిస్తాన్​తో సంబంధాలు ఉన్న వారి వివరాలను త్వరలోనే బయటపెడ్తం” అని అన్నారు.