
అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించింది. ఆదివారం (జూన్ 2)న ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 స్థానాలకు గాను 46 సీట్లు గెలుచు కుంది. బీజేపీ ఇప్పటికే 10 స్థానాల్లో అనూహ్యంగా విజయం సాధించింది.
మరోవైపు సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కి క్రాంతికారి మోర్చా (SKM) క్లీస్ స్వీప్ చేసింది. SKM సిక్కిం అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన 32 సీట్లలో SKM 31, SDF 1 గెలుచు కుంది. దీంతో తిరిగి సిక్కింలో ఎక్ కేఎం అధికారం చేపట్టనుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో 60 స్థానాలకు గానూ 10 సీట్లు పోటీ లేకుండా బీజేపీ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఇప్పటికే విజయం సాధించారు. గతంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.