నైజీరియాలో ఉగ్రదాడి.. 21మంది సైనికులు మృతి

నైజీరియాలో భారీ ఉగ్రదాడి జరిగింది. 2024, జూన్ 25వ తేదీ మంగళవారం సాయంత్రం  బుర్కినా ఫాసోతో దేశ సరిహద్దు సమీపంలో గుర్తుతెలియని ఉగ్రవాద సమూహం ఆకస్మిక దాడిలు చేసినట్లు జాతీయ టెలివిజన్‌లో  నైజర్ పాలక మిలిటరీ జుంటా ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో దాదాపు 21మంది నైజీరియన్ సైనికులు మరణించారని తెలిపారు.  ఈ దాడి వెనుక ఏ ఉగ్రవాద గ్రూపు ఉందో వెల్లడించలేదు.

కాగా, పలు సాయుధ సమూహాలతో కూడిన నైజర్ తీవ్ర భద్రతా సంక్షోభంతో పోరాడుతోంది. గత వారం, తిరుగుబాటుదారు పేట్రియాటిక్ లిబరేషన్ ఫ్రంట్ చైనా మద్దతు ఉన్న పైప్‌లైన్‌పై దాడి చేసింది. చైనాతో $400 మిలియన్ల ఒప్పందాన్ని రద్దు చేయకపోతే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చిరించింది.

నైజర్, పొరుగున ఉన్న మాలి, బుర్కినా ఫాసోలు కూడా అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సమూహంతో  దశాబ్ద కాలంగా పోరాడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం..  గత సంవత్సరం జరిగిన దాడుల్లో వేలాది మంది చనిపోగా..  2 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.