![సౌత్ కొరియాలో అగ్ని ప్రమాదం .. ఆరుగురు మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/at-least-6-killed-in-fire-at-south-korean-hotel-construction-site_a8xPEmpgL1.jpg)
సియోల్: దక్షిణ కొరియాలోని బుసాన్ సిటీలో ఒక రిసార్ట్ నిర్మాణ స్థలంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది ఉదయం 10:20 గంటలకు స్పాట్ కు చేరుకొని మధ్యాహ్నం వరకు మంటలను పూర్తిగా ఆర్పేశారు. సుమారు 100 మంది కార్మికులను ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు.
మరో 14 మందిని నిర్మాణం పైభాగం నుంచి హెలికాప్టర్ ద్వారా రక్షించినట్టు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. అయితే, నిర్మాణం మొదటి అంతస్తులో ఆరుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో కనిపించారని, వారిని ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారని ఆయన వెల్లడించారు.