
కర్నాటక కోలార్ లో ఏటీఎం మిషన్ లో నగదును కొంతమంది దుండగులు చోరీ చేశారు. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. కోలార్ బంగారు పేట ప్రధాన రహదారిపై హంచాల గేటు సమీపంలో కెనరా బ్యాంక్ ఏటీఎం లో చోరీ జరిగింది. డెక్కన్ హైడ్రాలిక్స్ కు చెందిన వాణిజ్య దుకాణ సముదాయంలో కెనడా బ్యాంక్ ఏటీఎం ఏర్పాటు చేశారు. శనివారం ( జులై 22) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్స్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ ఆధారాలు సేకరించారు.