భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: SI ఆత్మహత్యాయత్నం కేసులో అశ్వారావుపేట సీఐ, పోలీస్ సిబ్బందిపై శుక్రవారం ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసునమోదైంది. అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుల్స్ పై అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటనలో సీఐ జితేందర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సికింద్రాబాద్ పోలీసులు తెలిపారు. ఎస్ఐ సతీమణి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వరావుపేట ఎస్ఐ ప్రస్తుతం సికింద్రబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట SI ఆత్మహత్యాయత్నం కేసు మరో కీలక మలుపు. ఈ కేసులో CI తో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు పడిన విషయం తెలిసిందే. అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి CI జితేందర్ రెడ్డి వేధింపులే కారణమని విచారణలో తేలింది. దీంతో జితేందర్ రెడ్డిని ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అశ్వారావుపేట పీఎస్ లో రైటర్ గా పనిచేస్తున్న సుభానీ, కానిస్టేబుల్స్ శివ, సన్యాసినాయుడు, శేఖర్ ను ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేశారు ఉన్నతాధికారులు. సీఐ జితేందర్ రెడ్డిపై అశ్వారావుపేట మండలంలో అనేక ఆరోపణలున్నాయి.