ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. భారత్‌ను వెనక్కి నెట్టిన ఆస్ట్రేలియా

ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్..  భారత్‌ను వెనక్కి నెట్టిన ఆస్ట్రేలియా

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వచ్చేశాయి. నేడు (మే 3) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా టీమ్‌ఇండియాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. నిన్నటివరకు టీమిండియా మూడు ఫార్మాట్ లలో టాప్ ర్యాంక్ లో కొనసాగింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా.. టీమిండియా వన్డే, టీ20ల్లో నం.1 ర్యాంక్ లో కొనసాగుతుంది. 

జూన్ 2023లో ఇంగ్లాండ్ లోని ఓవల్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా టీమిండియాను 209 పరుగుల భారీ తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఖాతాలో 124 రేటింగ్ పాయింట్స్ ఉంటే.. టీమిండియా ఖాతాలో 120 పాయింట్స్ ఉన్నాయి. ఇంగ్లాండ్ (105),సౌతాఫ్రికా (103), న్యూజిలాండ్ (96) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నాయి.  

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్  859 రేటింగ్ పాయింట్స్ తో టెస్టుల్లో టాప్ ఉన్నాడు. రూట్, బాబర్ అజామ్, మిచెల్, స్మిత్ వరుసగా 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 6 , జైస్వాల్ 7, కోహ్లీ టాప్ 9 వ స్థానంలో కొనసాగుతున్నారు.