
కాగ జ్ నగర్, వెలుగు: అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు రోడ్డుపై మొరం వేసుకుని మరమ్మతులు చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా – చిత్తాం గ్రామాల మధ్య అటవీ ప్రాంతం గుండా మొరం, మట్టి రోడ్డు ఉంది. ఈ రోడ్డు వానాకాలంలో బంద్ ఉంటుంది.
చలికాలం గూడెం నుంచి కాగజ్ నగర్‌కి రాకపోకలు సాగించే బస్సు రోడ్డు బాగోలేక రావడం లేదు. దీంతో రోడ్డు బాగుచేయాలని ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం గ్రామస్థులే రోడ్డును బాగు చేసుకున్నారు.