జీవన భృతి చెల్లించాలని ఆటో డ్రైవర్ల ఆందోళన

సిరిసిల్ల టౌన్, చందుర్తి, వెలుగు: మహాలక్ష్మీ పథకంతో తమ ఉపాధి దెబ్బతిందని, తమకు నెలకు రూ.15వేల జీవన భృతి చెల్లించి ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు డిమాండ్​చేశారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు.  చందుర్తి మండల కేంద్రంలో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్​లీడర్లు మాట్లాడుతూ కాంగ్రెస్​ప్రభుత్వం తీరుతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో సుమారు 5వేల మంది ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆటోలకు ఫైనాన్స్​ కిస్తీలు కూడా కట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్​సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు. 

కోరుట్ల, వెలుగు:  కోరుట్లలో ఆటో, టాటా మ్యాజిక్​ డ్రైవర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్​ నుంచి ఆర్డీవో ఆఫీస్​ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్​లో వినతి పత్రం ఇచ్చారు.