
హైదరాబాద్‌కు చెందిన బ్లూజే ఏరో శుక్రవారం హైదరాబాద్‌లో వీటీఓఎల్(వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) కార్గో విమానాన్ని ప్రదర్శించింది. ఇది బ్యాటరీ, హైడ్రోజన్‌తో నడుస్తుంది. హైదరాబాద్,-- వరంగల్ వంటి నగరాల మధ్య వస్తువులను రవాణా చేయగలదు.
ఈ మానవరహిత విమానానికి రన్ వే అవసరం లేదు. దీని పేలోడ్ కెపాసిటీ 100 కిలోలు. దాదాపు 300 కి.మీ. ప్రయాణిస్తుంది. త్వరలో ప్యాసింజర్ విమానాన్ని తెస్తామని, ఇందులో ఐదుగురు కూర్చోవచ్చని బ్లూజే తెలిపింది.