కొత్తగా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ రీబ్రాండింగ్​ను మొదలుపెట్టింది.  కార్పొరేట్ పేరులో ‘యాక్సిస్’ని చేర్చింది.  కొత్త  బ్రాండ్‌‌‌‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు యాక్సిస్ బ్యాంక్‌‌‌‌తో కలిసి పని చేస్తున్నట్టు మ్యాక్స్​ ప్రకటించింది. దీనివల్ల తన కస్టమర్లకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయని పేర్కొంది. 

యాక్సిస్ బ్యాంక్‌‌‌‌  బలమైన నేపథ్యం  మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌  అనుభవం కలిసి కస్టమర్లకు రెండింతల భరోసాను ఇస్తాయని తెలిపింది. యాక్సిస్ బ్యాంక్‌‌‌‌ బ్రాంచ్ నెట్‌‌‌‌వర్క్ ద్వారా ఇన్సూరెన్స్ సేవలను మరింత సులభంగా పొందవచ్చు. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల కస్టమర్‌‌‌‌లకు  కొత్త ఆఫర్లు, బోనస్‌‌‌‌లు మొదలైన ప్రయోజనాలు దక్కుతాయని రెండు సంస్థలు ప్రకటించాయి.