అయ్యప్ప స్వాముల పాదయాత్ర : బండి సంజయ్

అయ్యప్ప స్వాముల పాదయాత్ర :  బండి సంజయ్
  • శబరిమల వెళ్లేందుకు స్పెషల బోగి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

 జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం నుంచి స్థానిక రైల్వే స్టేషన్ వరకు అయ్యప్ప స్వాములు పాదయాత్ర నిర్వహించారు. అయ్యప్ప మాలలు ధరించి 41 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షను తీసుకున్న స్వాములు ఇరుముడిని కట్టుకొని అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి పాదయాత్రగా రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. 

ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అయ్యప్ప స్వాములకు భారీగా స్వాగతం పలికారు. జమ్మికుంట పట్టణం నుంచి శబరిమలకు బయల్దేరుతున్న అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే అధికారులతో మాట్లాడి స్పెషల్ బోగిని జమ్మికుంట నుంచి ఏర్పాటు చేయించారు.