భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న ( బుధవారం) రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోగా తెలుగు క్రికెట్ ప్రేమికులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. చిరకాల ప్రత్యర్థి అయినప్పటికీ.. పాకిస్థాన్ జెండాలతో దాయాధి దేశానికి స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ లో వీరి బస జరిగింది.
హైదరాబాద్ ఫ్యాన్స్ చూపించిన అభిమానానికి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తో సహా ప్లేయర్లందరూ ధన్యవాదాలు తెలియజేసారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బాబర్ అజామ్ ని హోటల్ కి ఆహ్వానించే క్రమంలో అతని మీద మీద ఒక శాలువా కప్పారు. ఇది అచ్చం భారత రాజకీయ పార్టీ "బీజేపీ చిహ్నం" కాషాయ రంగు కలర్ ని పోలి ఉంది. చూడడానికి పాక్ కెప్టెన్ కూడా ఒక నాయకుడు లాగే కనిపించాడు. దీంతో ఇప్పుడు చాలా మంది బాబర్ అజామ్ ని బీజేపీ లీడర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Telangana BJP youth leader pic.twitter.com/EAm0uZoDEG
— Gabbar (@GabbbarSingh) September 28, 2023
కాగా.. పాకిస్థాన్ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో భాగంగా రేపు న్యూజిలాండ్‍తో, అక్టోబరు 3న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఇక వరల్డ్ కప్ లో తొలి రెండు ప్రధాన మ్యాచులు కూడా ఉప్పల్ వేదికగా ఆడనుంది. అక్టోబర్ 6 న నెదర్లాండ్స్ తో,10 న ఆస్ట్రేలియాతో ఈ మ్యాచులు జరుగుతాయి. నగరంలో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులు ఉన్న నేపథ్యంలో తగినంత భద్రత కల్పించలేమని ప్రేక్షకులని ఈ మ్యాచుకు అనుమతించడం లేదు.
Babar Azam gets a warm welcome in Hyderabad. pic.twitter.com/AZBCLPToH8
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023