వావ్.. పిల్లికి ఘనంగా శీమంతం వేడుకలు...


 

పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు కొందరు. కుక్క, పిల్లి వంటి జంతువులను తమ పిల్లలగా భావించి.. వేడుకలను జరపడం, అందంగా అలంకరించడం వంటి సరదాలు తీర్చుకుని సంతోషపడుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో దర్శనంఇచ్చి సందడి చేస్తున్నాయి. తాజాగా గర్భవతులైన పిల్లలులకు మహిళలకు జరిపినట్లే శీమంతం వేడుకను నిర్వహించి.. తమ ముచ్చటను తీర్చుకుంది. తెలంగాణలోని ఒక కుటుంబం. పిల్లి జాతి కోసం బేబీ షవర్‌ను నిర్వహించింది. ఈ  ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు  జరిపినట్లే.. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా   మధిరలోని సీపీఎస్ రోడ్డులో నివసిస్తున్న అల్లూరి నాగభిక్షం - పద్మ దంపతులు పిల్లికి సీమంతం నిర్వహించారు. నాగభిక్షం ఇంట్లో ఆర్టీసీ మధిర డిపో కండక్టర్ అబ్బాస్ కుటుంబం అద్దెకు ఉంటోంది. వీరి పెంచుకుంటున్న పిల్లి నాగభిక్షం దంపతులకు మచ్చిక అయింది. సాషా పేరిట పెంచుకుతున్న పిల్లి ప్రస్తుతం గర్భంతో ఉండగా నాగభిక్షం - పద్మ ఆధ్వర్యాన బంధుమిత్రులను ఆహ్వానించి సీమంతం నిర్వహించారు. 

ఈసందర్భంగా పిల్లిని గాజులు, గొలుసులు పూలదండ, డ్రెస్​ తో  అలంకరించి వడి నింపే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పూలమాల వేసి ప్రత్యేక అలంకరణలు, కంకణాలు చేసి హారతి నిర్వహించారు. వారు పిల్లికి ఇష్టమైన ఆహారాన్ని కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వారు తమ పొరుగువారిని కూడా ఆహ్వానించారు. ఇది చూసిన పలువురు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.