బచ్చన్నపేట పశువుల సంత వేలం రూ. 5.18 లక్షలు

బచ్చన్నపేట పశువుల సంత వేలం రూ. 5.18 లక్షలు

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మేజర్​పంచాయతీ పశువుల సంత వేలంపాట బుధవారం జరిగింది.  ఏడాదిపాటు పశువుల సంతలో క్రయ, విక్రయాలు, రహదారి నిర్వహణకు వేలంపాట నిర్వహించారు.  బచ్చన్నపేట పట్టణానికి  చెందిన మంచాల వినయ్​ రూ. 5.18 లక్షలకు దక్కించుకున్నారు.

  తైబజార్​ వేలంపాట సంతలో  కూరగాయల దుకాణాల వద్ద రుసుము వసూలు చేయడం రూ.  2. 55 లక్షలకు దేవిని నగేశ్​ దక్కించుకున్నాడు.  పశువుల సంతలో పశువులను వాహనాల్లోకి ఎక్కిండం (డక్కా) వేలం పాటకు రూ. 27 వేలకు మంచాల వివేక్​ దక్కించుకున్నాడు. గతంలో లాగా పలుమార్లు వాయిదా పడకుండా ఒకే రోజు వేలంపాట ముగియడంతో పంచాయతీ ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.