అయ్యప్ప జన్మ వృత్తాంతం, భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన బైరి నరేశ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని వరంగల్ లో అదుపులోకి తీసుకున్నారు. నరేష్ పై కొండగల్ లో కేసు నమోదు కావడంతో అతడిని అక్కడికి తరలిస్తున్నారు. కాగా అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్పస్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసి కఠింనంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
హిందువుల మనోభావాలను కించపరిచన నరేష్ ను కొందరు అయ్యప్ప స్వాములు ఉరికించి చితకబాదారు. అయితే నరేష్ ను అరెస్ట్ చేశామని.. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి కోరారు. అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటి వరకు 200 పోలీస్ స్టేషన్లలో నరేష్ పై కేసులు నమోదయ్యాయి.