రూ.3.98 లక్షల కోట్లకు బజాజ్ ఫైనాన్స్ ఏయూఎం

రూ.3.98 లక్షల కోట్లకు బజాజ్ ఫైనాన్స్ ఏయూఎం

న్యూఢిల్లీ: కిందటి నెల 31 నాటికి బజాజ్ ఫైనాన్స్ మేనేజ్ చేస్తున్న అప్పులు, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల విలువ (అసెట్ అండర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఏయూఎం) రూ.3.98 లక్షల కోట్లకు పెరిగింది.  2023, డిసెంబర్ 31 నాటితో (రూ.3.10 లక్షల కోట్లతో) పోలిస్తే  28 శాతం వృద్ధి చెందింది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కంపెనీ ఏయూఎం రూ.24,100 కోట్లు పెరిగింది.    

బజాజ్ ఫైనాన్స్ డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్ విలువ 2024, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 నాటికి  ఏడాది ప్రాతిపదికన  రూ.58,008 కోట్ల నుంచి 19 శాతం వృద్ధి చెంది రూ.68,800  కోట్లకు చేరుకుంది. కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.2 కోట్ల కొత్త లోన్లను కంపెనీ ఇచ్చింది. ఇది 2023 లోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇచ్చిన 98.6 లక్షలతో పోలిస్తే 22 శాతం ఎక్కువ.