బీఆర్ఎస్ లోకి సర్పంచులు

సిరికొండ, వెలుగు: మెట్టు మర్రి తండా సర్పంచ్ మంజుల, ఆమె భర్త బాల్ సింగ్ గురువారం కాంగ్రెస్​పార్టీ నుంచి బీఆర్​ఎస్​లో చేరారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్, లీడర్లు చందర్, మోజీరాంనరహరి, బాల్ కిషన్ పాల్గొన్నారు.

ALSO READ : రైతుల శ్రేయస్సు కోసం సమష్టిగా కృషి చేయాలి: ఈగ సంజీవరెడ్డి

లింగంపేట: ఎల్లారం గ్రామ సర్పంచ్​ పట్లోల్ల మల్లయ్య యాదవ్​ గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. మొదటి నుంచి బీఆర్ఎస్ లో ​ఉన్న ఆయన నెల కింద కాంగ్రెస్​లో చేరారు. మనసు మార్చుకొని తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ​మండలాధ్యక్షుడు దివిటి రమేశ్​, డీసీఎంఎస్​ డైరెక్టర్​ కపిల్​రెడ్డి, శ్రీనునాయక్​ పాల్గొన్నారు.