హైదరాబాద్: బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్సై రమణ ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ్ గిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన 2020 ఎస్సై బ్యాచ్ కు చెందిన వారు. బంజారాహిల్స్ లో ట్రాఫిక్ సబ్ ఇన్స్ పెక్టర్ గా పనిస్తున్నారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ప్రాంతం. పోస్టు మార్టం కోసం డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ట్రాఫిక్ ఎస్ఐ రమణ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.