ఎస్సీ రిజర్వేషన్​ బిల్లు ఆమోదంపై హర్షం

ఎస్సీ రిజర్వేషన్​ బిల్లు ఆమోదంపై హర్షం

బాన్సువాడ, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై బాన్సువాడ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకులు కాల్చి, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.  బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎరువల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. 

ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో గురు వినయ్ కుమార్, నరసన్న చారి, నందకుమార్, ఖాలేఖ్, మధుసూదన్ రెడ్డి, వనం గంగాధర్, డోన్ కంటి వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.