కవిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు

బాన్సువాడ, వెలుగు: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సోమవారం ఎమ్మెల్యే పోచారం గృహంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయితే కొట్లాడి తెచ్చింది కేసీఆర్ అని ఎలా చెప్పుకున్నరో అలాగే నిధులు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినా పోచారం నిధులు తేవడానికి కృషి చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ పదవి చేసిన వారు ఓడిపోతుండగా శ్రీనివాస్ రెడ్డి చేసిన మంచి పనుల వల్ల  ప్రజల మన్ననను పొంది గెలిచారన్నారు. తమ నాయకుడి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేశ్, రవీందర్, గోపాల్ రెడ్డి, మోహన్ నాయక్ ఉన్నారు.