విజయం అంచుల దాకా రావటం.. ఓడటం.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఇది పరిపాటే. వారి అత్యుత్సాహమే అందుకు ప్రధాన కారణం. తాజాగా, ఆ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శన చేసింది. విజయం అంచుల దాకా వచ్చి పరాజయం పాలైంది. ఫలితంగా సెమీస్ చేరే అవకాశాలను చేజేతులా పోగుట్టుకుంది.
అండర్-19 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో బంగ్లా 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అనేక మలుపు తిరుగుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లో చివరకు పాక్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ పాక్ యువ జట్టు.. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో 155 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు చేసిన మిన్హాస్ ఆ జట్టు టాప్ స్కోరర్. దీంతో అందరూ ఈ టోర్నీలో పాక్ కథ ముగిసినట్టే అనుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధిస్తారనుకున్నారు. తీరా చూస్తే అంతా తలకిందులైంది.
156 పరుగుల చేధనకు దిగిన బంగ్లా జట్టు విజయానికి 5 పరుగుల దూరంలో నిలిపోయింది. 35.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నసీం షా తమ్ముడు ఉబైద్ షా.. బంగ్లా బ్యాటర్లను వణికించాడు. 5 వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో జట్టును సెమీస్ చేర్చాడు. ఈ మ్యాచ్ ఆఖరివరకూ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్ల డగౌట్లలోనూ టెన్షన్ వాతావరణం కనిపించింది.
THIS IS THE MOMENT WHEN PAKISTAN DEFEATED BANGLADESH ??❤️❤️❤️❤️
— Farid Khan (@_FaridKhan) February 3, 2024
Save this tweet, retweet it and watch it on loop ??? #U19WorldCup #PAKvsBAN pic.twitter.com/tviOOYKGc0