బాసరలో పెరిగిన టికెట్ల ధరలు

నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పెంచిన నిత్యపూజ టికెట్ల ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. అక్షరాభ్యాసంతోపాటు నిత్య పూజలు, హోమాలు, అభిషేకాల ధరలుపెరిగాయి. 

అక్షరాభ్యాసానికి  ప్రస్తుతం 100 రూపాయల ధర ఉండగా.. రూ.150కి పెంచారు. అలాగేఅమ్మవారి రుద్రాభిషేకం  టికెట్ ధర రూ.200 ఉండగా.. రూ.500 లకు పెంచారు. అలాగే నిత్య చండి హోమం టికెట్ ధర రూ.1116 ఉండగా రూ.1500 కు పెరిగింది.అలాగేసత్యనారాయణ స్వామి పూజ టికెట్ ధర రూ.100 నుంచి రూ.400 కు పెరిగింది.