ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి : బాషబోయిన సంతోష్

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి : బాషబోయిన సంతోష్

హసన్ పర్తి,వెలుగు : పెండింగ్​ స్కాలర్షిప్ ను, ఫీజు రియింబర్స్​ మెంట్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి బాషబోయిన సంతోష్ డిమాండ్​ చేశారు. బుధవారం హనుమకొండలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ... కాంగ్రెస్​ పార్టీ ఎన్నికలకు ముందు బకాయిలను విడుదల చేస్తామని, విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని, విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు.

 వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, కుక్కల కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కసర బోయిన రవితేజ, జిల్లా సమితి సభ్యులు సిపతి వినయ్, సంధ్య, ప్రవళిక, రూబియానా, రాము, రాజు, అనిల్, వినయ్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు