నిర్మల్/బజార్ హత్నూర్/కాగజ్ నగర్, వెలుగు: బతుకమ్మ ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ, డీజే పాటలకు డ్యాన్సులతో హోరెత్తించారు. ప్రిన్సిపాల్ సునీల్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ పండుగ అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జ్ఞానేశ్వర్ షిండే, కల్చరల్ ఇన్చార్జ్ శ్రీనివాస్, భీమేశ్, అశోక్ రెడ్డి, వనజ, అనూష, సిబ్బంది పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్మల్పట్టణంలోని ఎస్సెస్సార్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో
బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్ గోవర్దన్, ఏబీవీపీ విభాగ్ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ చంద్రగిరి శివ కుమార్, సురేశ్,రాజు వంశీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేశ్, మున్నా, మహేశ్తదితరులు పాల్గొన్నారు. కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్, లెక్చరర్లు బతుకమ్మలు పేర్చి
ఆడిపాడారు.