
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. కెసిఆర్ చిత్రపటాన్ని బయటికి తీసుకొచ్చి పగలగొట్టారు.