బీసీలు రాజకీయంగా ఎదగాలి

బీసీలు రాజకీయంగా ఎదగాలి

జహీరాబాద్, వెలుగు : జనాభాలో 60 శాంతం ఉన్న బీసీలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జహీరాబాద్ లోని ఓ హోటల్​లో బీసీ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎంజీ రాములు, గొల్ల భాస్కర్, రాములు నేత, విజయకుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలు ఐక్యంగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. 

ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు ఓట్లు వేసి సత్తాచాటాలని కోరారు. 60 శాతం ఉన్న బీసీలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.