బీసీ బిల్లుకు సహకరించండి.. ఎన్సీబీసీ చైర్మన్​కు బీసీ ఆజాదీ ఫెడరేషన్ వినతి

బీసీ బిల్లుకు  సహకరించండి.. ఎన్సీబీసీ చైర్మన్​కు బీసీ ఆజాదీ ఫెడరేషన్  వినతి
  • ఎన్సీబీసీ చైర్మన్​కు బీసీ ఆజాదీ ఫెడరేషన్  వినతి

న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఏక గ్రీవంగా తీర్మానం పొందిన బిల్లులను రాజ్యాం గంలోని 9వ షెడ్యూలులో చేర్చేందుకు సహక రించాలని జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ)కు బీసీ ఆజాదీ ఫెడరేషన్  నేతలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఎన్సీబీసీ చైర్మన్  హన్సరాజ్​ను బీసీ ఆజాదీ ఫెడరేష న్  జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్​ కు మార్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని ప్రధానమైన డిమాండ్ గా ఉందని, దీనిపై కేంద్రంలోని బీజేపి సర్కారు సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.