బీసీ గురుకుల సొసైటీ, ప్యూర్ మధ్య ఎంవోయూ : సైదులు

  • స్టూడెంట్స్​లో స్కిల్స్ పెంచేందుకు కృషి చేస్తం: సైదులు

హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లలో స్కిల్స్ పెంచడమే లక్ష్యంగా బీసీ గురుకులాల సొసైటీ, ప్యూర్(పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) మధ్య కీలక అవగాహన ఒప్పందం  (ఎంవోయూ) జరిగింది. శుక్రవారం మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లోని బీసీ గురుకుల ఆఫీసులో సెక్రటరీ సైదులు, ప్యూర్ సీఈవో శైలా తల్లూరీలు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను, సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ లో ట్రైనింగ్ అందిస్తారు. డిజిటల్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు , ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. టీమ్ వర్క్ , సామాజిక సేవలను ప్రోత్సహించడానికి ప్యూర్ యువజన క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తారు. మహిళా విద్యార్థుల నెలసరి హైజీన్ అవగాహనను పెంపొందించడానికి పలు సదస్సులు నిర్వహించనున్నారు.   ఈ సందర్భంగా బీసీ గురుకుల సెక్రటరీ సైదులు మాట్లాడుతూ.. ప్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్యా కార్యక్రమాలను అందించడం, వారికి ప్రపంచంతో పోటీపడే సామర్థ్యాన్ని అందింస్తామని తెలిపారు. ప్యూర్ సీఈవో శైల తల్లూరి మాట్లాడుతూ.. మా వనరులను, నైపుణ్యాలను ఉపయోగించి స్టూడెంట్స్, ఫ్యాకల్టీకి స్కిల్స్ నేర్పించటానికి కృషి చేస్తామన్నారు.