బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్
  • నేటి నుంచి వచ్చే నెల 5 వరకు అప్లికేషన్లకు గడువు

హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో 2025–26 అకడమిక్ ఇయర్ డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజైంది. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు బుధవారం నుంచి వచ్చే నెల 5వరకు ఆన్ లైన్ లో mjptbcwreis.telangana.gov.in,  tgrdccet.cgg.gov.in/TGRDCWEB/ లో అప్లై చేసుకోవాలని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు సూచించారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మొత్తం 32 కోర్సుల్లో 4,880 మంది బాలికలు , 4,380 మంది బాలురకు సీట్లు ఉన్నాయని పత్రిక ప్రకటనలో తెలిపారు.

గతేడాది వరకు ప్రతి ఏటా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించి సీట్లు భర్తీ చేయగా, ఈ ఏడాది నుంచి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బీసీ గురుకులాల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్​కు అప్లికేషన్ ఇస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెం. 040-–23328266 లో సంప్రదించాలని ఆయన సూచించారు.