- వచ్చే నెల 15 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సహాయం అందించే మహాత్మా జ్యోతి బాపూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ విద్యా నిధికి అప్లై చేసుకునేందుకు బీసీ సంక్షేమ శాఖ అప్లికేషన్లను ఆహ్వానిస్తుంది. ఈ మేరకు బుధవారం ఆ శాఖ కమిషనర్ బాల మాయదేవి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు అప్లై చేసుకోవాలని సూచించారు.
ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏండ్లలోపు ఉండి యాన్యువల్ ఇన్ కం రూ.5లక్షల లోపు ఉన్న బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ ఈ స్కీమ్‌కు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని కమిషనర్ కోరారు.