పలుగురాళ్ల గుట్ట బ్లాస్టింగ్​ ఆపాలి : యుగంధర్​గౌడ్​

పలుగురాళ్ల గుట్ట బ్లాస్టింగ్​ ఆపాలి : యుగంధర్​గౌడ్​
  • బీసీ పొలిటికల్​ జేఏసీ ఛైర్మన్​యుగంధర్​గౌడ్​

వనపర్తి, వెలుగు :   పెబ్బేరు మండలం వైశాఖాపూర్  గ్రామ శివారులోని పలుగురాళ్ల మైనింగ్ గుట్టపై  బ్లాస్టింగ్​ను ఆపాలని బీసీ పొలిటికల్​ జేఏసీ ఛైర్మన్​ యుగంధర్​గౌడ్​ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన గ్రామస్థులతో   కలిసి గుట్టను సందర్శించారు. 

అనంతరం జిల్లా కలెక్టర్​ ఆదర్శ్​ సురభిని కలిసి బ్లాస్టింగ్​ కాంట్రాక్టును రద్దు చేయించి ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు  తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి  వెంకటన్న గౌడ్, జిల్లా కార్యదర్శి  జితేందర్ గౌడ్, నాయకులు  అంజన్న, మహేందర్, రమేష్ సాగర్  తదితరులు పాల్గొన్నారు.