ఫీజు బకాయిల కోసం జనవరి 30న బీసీ విద్యార్థుల సమర శంఖారావం

ఫీజు బకాయిల కోసం జనవరి 30న బీసీ విద్యార్థుల సమర శంఖారావం
  • ఓయూలో పోస్టర్​ రిలీజ్​ 

ఓయూ, వెలుగు: పెండింగ్​ఫీజు బకాయిలు విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్​చేస్తూ ఈ నెల 30న ఇందిరా పార్కు వద్ద బీసీ విద్యార్థుల శంఖారావం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పోస్టర్​ను బీసీ విద్యార్థి నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమర శంఖారావానికి 33 జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్​మెంట్​అందక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమై, కులవృత్తులు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ఖాజానాతో కొంతమంది కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారే తప్ప పేదల విద్యకు కేటాయించడం లేదన్నారు.