సచిన్కు బీసీసీఐ గోల్డెన్ టికెట్

ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారత్ లో నిర్వహించబడుతుంది. ఇందుకోసం బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంది. భారత్‌లోని ఐకాన్‌లకు ప్రత్యేక టిక్కెట్లు ఇవ్వాలని బోర్డు ప్లాన్ చేసింది. అందులో భాగంగా'గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్' అని పేరుతో ఓ  కార్యక్రమాన్ని  చేపట్టింది.  

ఇందులో తొలి గోల్డెన్ టిక్కెట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు అందించింది.  తాజాగా ఇప్పుడు సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ టికెట్‌ అందించింది.  బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ టికెట్ ను సచిన్ కు  అందించారు.

Also Read :- బాబర్ అజామ్ కాదు.. ఈ ఏడాది బవుమానే టాప్

 

ఈ టికెట్ తో టెండూల్కర్  ప్రపంచ కప్ 2023 లోని అన్ని మ్యాచ్ లను VIP స్టాండ్ నుండి ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.