మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల అమ్లేట్లు తిన్నారు. విన్నారు. ఇటీవల మామిడి పండ్ల ఆమ్లేట్ గురించి కూడా తెలుసుకున్నారు. మరి బీర్ ఆమ్లేట్ గురించి ఎప్పుడైనా విన్నారా..ఎక్కడైనా తిన్నారా..బీర్ తో ఆమ్లేటా అని ఆశ్చర్యపోతున్నారా..అవును నిజం. ఓ వ్యక్తి బీర్ తో ఆమ్లేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియోలో ఓ వ్యక్తి స్టవ్ పై భారీ పెనాన్ని పెట్టాడు. ఆ తర్వాత పెనంపై నూనేకు బదులు బీర్ ను పోశాడు. అప్పటికే కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని పెనంపై పోశాడు. దానిపైన, చుట్టూ కూడా మళ్లీ బీర్ ను పోశాడు. మళ్లీ ఎగ్ మిశ్రమంలో మరింత బీర్ పోసి మిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమ్లెట్ ను భుర్జీలా చేశాడు. అనంతరం కస్టమర్లకు బీర్ ఆమ్లెట్ ను సర్వ్ చేశాడు.
ALSO READ: 120 రోజులు... గెలుపు కోసం కాంగ్రెస్ కార్యాచరణ
వైరల్..
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా దాదాపు 7లక్షల మంది లైక్ చేశారు.
ఫన్నీ కామెంట్లు..
ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా, ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బీర్ ఆమ్లెట్ ను వ్యతిరేకిస్తుండగా..మరికొందరు ఏం చేశావు బ్రదర్ అంటూ మెచ్చుకుంటున్నారు. బీర్ వృథా అయిపోయిందంటూ పెట్టారు. బీర్ ఆమ్లెట్లో మంట ధాటికి బీర్ సాంకేతికంగా ఆవిరి అయిపోతుందని కామెంట్ చేశారు.