అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివి : బీర్ల ఐలయ్య

అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివి : బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు : విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ సిబ్బంది చూపించే తెగువ ప్రజలకు శ్రీరామ రక్ష లాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తారని, విధి నిర్వహణలో వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆదివారం యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో డీఎఫ్ వో మధుసూదన్ రావుతో కలిసి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రజలు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలని కోరారు. అగ్నిమాపక శాఖ విధులు చాలా కీలకమైనవని, విధి నిర్వహణలో ఫైర్ సిబ్బంది ప్రాణాలను తెగించి పనిచేస్తారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలపై అందరికీ అవగాహన ముఖ్యమని, ఇందులో భాగంగానే అగ్నిమాపక శాఖ ఏటా వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఫైర్ ఆఫీసర్లు అబ్దుల్ హమీద్, మధుసూదన్ రెడ్డి, మధుకర్, ఇన్​చార్జి ఆఫీసర్ డాక్టర్ బాబు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.