
- అలాంటి వారిపై చర్యలు తీసుకుంటానన్న బెల్లయ్య నాయక్
హైదరాబాద్, వెలుగు: కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హెచ్చరించారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. శుక్రవారం జరిగిన పీసీసీ మీటింగ్లో తాను జై జగత్ అంటే దాన్ని కొందరు జై జగన్ అన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
జై జగత్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదమని, జై జగత్ అంటే సమాజం అంతా ఒక్కటేనని వివరించారు. ఈ సభలో తాను సీఎం రేవంత్ పేరును మరిచిపోయినట్టు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, దీన్ని కొన్ని మీడియా చానెల్స్ కూడా ప్రచారం చేశాయన్నారు. ఆదివారం లోగా వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.