ములకలపల్లి, వెలుగు: సర్వే చేసిన ప్రతీ సెంటు పోడు భూమికి పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని సర్వే చేసి హక్కు పత్రాలు కల్పించని పోడు సాగుదారులతో కలిసి సోమవారం భద్రాచలం ఐటీడీఏ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఐటీడీఏ డీటీ శ్రీనివాసరావుకు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సర్వే చేసి ప్లాంటేషన్ పేరుతో ఆపుతున్న పోడు రైతులందరికీ హక్కులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. హక్కు పత్రాలు ఇచ్చిన పోడు రైతులందరికీ రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీలపై చూపుతున్న వివక్షను వెంటనే విరమించుకోవాలని, వలస ఆదివాసీలకు కూడా హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ పోడియం వెంకటేశ్వర్లు, నాగబాబు, హనుమ, రోజా, సత్యం, తదితరులు పాల్గొన్నారు.
సర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి
- ఖమ్మం
- July 4, 2023
లేటెస్ట్
- ఏసీబీ ఆఫీసు వద్ద అరగంట హై డ్రామా.. వాగ్వాదం.. వెనుదిరిగి వెళ్లిన కేటీఆర్
- Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?
- ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు
- హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం: సీఎం రేవంత్
- మా పార్టీ మీ వెంటే ఉంటుంది.. సీఎం రేవంత్ రెడ్డితో అసదుద్దీన్ ఒవైసీ
- V6 DIGITAL 06.01.2025 EVENING EDITION
- ఐదుగురు సీఎంలు చేయని పని రేవంత్ రెడ్డి చేస్తుండు: MP అసదుద్దీన్ ఒవైసీ
- ఓల్డ్ సిటీలో ఒలంపిక్ మెడల్స్ తీసుకువచ్చే ఫుడ్ బాల్ ప్లేయర్స్: అక్బరుద్దీన్
- చాహల్ - ధనశ్రీ సంసారంలో చిచ్చు.. ఎవరీ ప్రతీక్ ఉటేకర్..?
- ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
Most Read News
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- వైరస్‌తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- ఇండియాలో HMPV వైరస్ ఒకటి కాదు.. రెండు కేసులు.. ICMR కన్ఫార్మ్ చేసేసింది..
- బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..