గిరిజన గ్రామాలకు బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

గిరిజన గ్రామాలకు బస్సు ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం నుంచి పాలిటెక్నిక్​ కాలేజీ, తునికిచెరువు, చీపురుపల్లి, మారాయిగూడెం, ఆర్లగూడెం, మహాదేవపురం తదితర మారుమూల గిరిజన గ్రామాల మీదుగా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం వరకు ఆర్టీసీ సర్వీసును భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. ఛత్తీస్​గఢ్​ బార్డర్​ను తాకుతూ వెళ్లే ఈ సర్వీసు వల్ల గిరిజనులకు రవాణా కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఉదయం, సాయంత్రం తిరిగే ఈ సర్వీసును గిరిజనులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్​ తిరుపతి, అసిస్టెంట్​ మేనేజర్​ గౌతమి తదితరులు పాల్గొన్నారు.