- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
భద్రాచలం, వెలుగు : స్టూడెంట్స్ చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సూచించారు. స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం మండల స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మనసికోల్లాసానికి, శరీరధారుడ్యానికే కాకుండా దేశ ఆరోగ్య దిక్సూచిని తెలుపుతాయన్నారు.
ములకలపల్లి : మండలంలోని జడ్పీహెచ్ఎస్లో రెండు రోజులపాటు నిర్వహించే మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలను శుక్రవారం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను జోనల్ స్థాయిలో పాల్గొనేందుకు పంపనన్నట్లు తెలిపారు.
వైరా : వైరా లో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మండల స్థాయి ప్రభుత్వ, ప్రవేట్ స్కూళ్లకు పలు క్రీడలను ప్రారంభించారు. వైరా మున్సిపల్ కమిషనర్ వేణు, ఎంఈవో వెంకటేశ్వర్లుతో కలిసి మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తోందని తెలిపారు.