భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.71కోట్లు

 భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ.1.71కోట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. రూ.1,71,20231  ఆదాయం వచ్చింది. బంగారం 92 గ్రాములు, కిలో 485 గ్రాముల వెండి హుండీల ద్వారా వచ్చింది. యుఎస్​ఏ డాలర్లు 923, ఆస్ట్రేలియా డాలర్లు 165, సింగపూర్​ డాలర్లు 12, కెనడా విన్గింట్​ డాలర్లు 20, ఇంగ్లాండ్​ పౌండ్స్ 5, యూరోప్​ యూరోస్ 10, మలేషియా రింగిట్స్ 20, థాయిలాండ్​ భాట్స్ 20  వచ్చాయి. ఆదాయం మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక బ్యాంకు ఆఫీసర్లకు ఈవో రమాదేవి అందజేశారు.