- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పదో తరగతి స్టూడెంట్స్ఫైనల్ ఎగ్జామ్స్లలో అత్యధిక మార్కులు సాధించేందుకు టీచర్స్ కృషి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా ) ఆధ్వర్యంలో రూపొందించిన ఆంగ్ల ఐపాస్–2025 బుక్స్‌ను కలెక్టర్ ఎల్టా ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్‌కు ఇంగ్లీష్ అంటే భయం లేకుండా టీచర్స్ సులువుగా అర్థమయ్యే లా బోధించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, ఎల్టా ప్రతినిధులు దస్తగిరి, షేక్ జహంగీర్, మేరెడ్డి ఇంద్రసేనారెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా ఈ నెల 21న కొత్తగూడెంలోని ఆనంద్ఖని జడ్పీహెచ్ఎస్ లో జిల్లా స్థాయి ఆంగ్ల ఒలంపియాడ్ పోటీలు నిర్వహించనున్నట్టు ఎల్టా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్దస్తగిరి, షేక్ మీరా హుస్సేన్ తెలిపారు.