- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
పాల్వంచ రూరల్, వెలుగు : మునగ పంటతో లాభాలు ఎక్కువగా ఉంటాయని కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాల్వంచ మండలంలోని బిక్కుతండా గ్రామపంచాయతీలో గుగులోతు బాలాజీ సాగు చేస్తున్న మునగ పంటను కలెక్టర్ పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగ కాయలతో పాటు ఆకులు కూడా పొడిచేసి అమ్మవచ్చని తెలిపారు.
ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరాకు రూ.లక్ష 20 వేలు సహాయంగా ప్రభుత్వం అందిస్తోందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విద్యాచందన, ఎంపీడీవో విజయభాస్కరరెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీవో నారాయణ , ఏవో శంభో శంకర , ఏపీవో పోరండ్ల రంగా, ఏపీఎం రాంబాబు, ఆర్ఐ హాచ్చ, కార్యదర్శి సౌజన్య, క్షేత్ర సాంకేతిక సహాయకులు రజిత, నాగేశ్వరరావు, సీసీ పద్మ, తదితరులు పాల్గొన్నారు.